నియామకాలు బాగుంటాయ్‌
close

Published : 09/06/2021 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నియామకాలు బాగుంటాయ్‌

రవాణా, సేవల రంగాల్లో అధికం
ఆర్థిక, బీమా విభాగాల్లో పరిమితం

గనులు, నిర్మాణాల్లో కోతలు
పీఎల్‌ఐ పథకంతో ఉద్యోగాల సృష్టి; మ్యాన్‌పవర్‌ ఇండియా గ్రూపు  
ముంబయి

కొవిడ్‌-19 రెండో దశ పరిణామాలు అవరోధాలు సృష్టిస్తున్నా, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి  భారత్‌ దృఢ నిశ్చయంతో పనిచేస్తోందని, ఫలితంగా నియామకాలు స్థిరంగా ఉంటాయని ఓ సర్వే పేర్కొంది. జులై- సెప్టెంబరులో తయారీ, విద్య, ప్రజా పరిపాలన విభాగాల్లో నియామకాలు బాగుంటాయని  అభిప్రాయపడింది. రవాణా, వినియోగం, సేవల రంగాలు నియామకాలపరంగా ముందు వరుసలో ఉంటాయని తెలిపింది. ‘మ్యాన్‌పవర్‌గ్రూపు ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే’ పేరుతో మ్యాన్‌పవర్‌ గ్రూపు ఇండియా ఈ సర్వే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1,303 సంస్థల నుంచి వివరాలు సేకరించినట్లు సంస్థ తెలిపింది. రాబోయే అయిదేళ్లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్‌ఐ) కింద రూ.2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించడం వల్ల ఉద్యోగాల సృష్టితో పాటు ఉత్పత్తి పెరుగుతుందని మ్యాన్‌పవర్‌ గ్రూపు ఇండియా గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ గులేటి అన్నారు. టీకాల పంపిణీ మరింత విస్తృతమై, వినియోగదారు విశ్వాసం మెరుగుపడితే విక్రయాలు, సేవలు, సరఫరా విభాగాల్లో ఉద్యోగాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సర్వేలో వెల్లడైన వివరాలు ఇలా..
* రవాణా, వినియోగ రంగాల్లో నియామకాలు నికరంగా 10 శాతం,సేవల రంగంలో ఇది 7 శాతం, తయారీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, విద్యా రంగాల్లో 6 శాతం వృద్ధికి అవకాశం ఉందని తెలిపింది.
* బీమా, ఆర్థిక, స్థిరాస్తి రంగాల్లో నియామకాలు పరిమితంగానే ఉండొచ్చు.  టోకు, రిటైల్‌ వాణిజ్య రంగాల్లో నియామకాల అవకాశాలు స్తబ్దుగా  (3%, 2%) ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. గనులు, నిర్మాణ రంగాల్లో ఉద్యోగాల కోతకు ఆస్కారం ఉందని వివరించింది.
* దిగ్గజ కంపెనీలతో పోలిస్తే మధ్యతరహా కంపెనీల్లో నియామకాలకు ఎక్కువగా అవకాశాలు కన్పిస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని