పీసీ గేమింగ్‌ భలే భలే
close

Published : 10/06/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీసీ గేమింగ్‌ భలే భలే

 దేశంలో పెరుగుతున్న ఆదరణ
 ఉపాధిగా ఎంచుకుంటున్న మహిళలు
 హెచ్‌పీ ఇండియా సర్వే

దిల్లీ: దేశంలో పీసీ గేమింగ్‌కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని హెచ్‌పీ ఇండియా సర్వే వెల్లడించింది. ఒత్తిడి పోగొట్టే వ్యాపకంగానే కాకుండా ఉపాధి అవకాశంగా కూడా మహిళలు ఈ రంగాన్ని చూస్తున్నారని తెలిపింది. హెచ్‌పీ ఇండియా గేమింగ్‌ ల్యాండ్‌స్కేప్‌ నివేదిక 2021 ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే కంప్యూటర్లలో గేమింగ్‌ అనుభూతి బాగుంటుందని 89 శాతం మంది తెలిపారు. మెరుగైన గేమింగ్‌ కోసం కంప్యూటర్‌కు మారతామని 37 శాతం మంది మొబైల్‌ గేమర్లు సంకేతాలిచ్చారు. దేశంలో 25 నగరాల్లో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నిర్వహించిన ఈ సర్వేలో 1500 మంది పాల్గొన్నారు. సర్వేలోని మరిన్ని అంశాలు ఇలా..
*ఆటల కోసం మొబైల్‌ ఫోన్ల కంటే కంప్యూటర్లకే మొగ్గుచూపుతామని ద్వితీయ శ్రేణి నగరాలకు చెందిన 94 శాతం మంది, ప్రథమ శ్రేణి నగరాల నుంచి 88 శాతం మంది, మెట్రో వాసులు 87 శాతం మంది వెల్లడించారు. ప్రాసెసింగ్‌ వేగం, డిస్‌ప్లే, ధ్వని వంటివి ఇందుకు కారణాలుగా పేర్కొన్నారు.  
* గేమింగ్‌ పరిశ్రమలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని 90 శాతానికి పైగా తెలిపారు. గేమింగ్‌ను వృత్తిగా ఎంపిక చేసుకోవాలనుందని 84 శాతం మహిళలు, 80 శాతం మంది పురుషులు వెల్లడించారు.
* కంప్యూటర్లను వినోదం (54 శాతం), ఫోటో/వీడియో ఎడిటింగ్‌ (54 శాతం), గ్రాఫిక్‌ డిజైన్‌ (48 శాతం) వంటి ఇతర పనులకు వినియోగిస్తున్నారు.
* గేమింగ్‌ వల్ల ఒత్తిడి తగ్గుతుందని 92 శాతం మంది, కొత్త స్నేహితులు దొరుకుతారని 91 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏకాగ్రత పెరుగుతుందని 91 శాతం మంది విశ్వసిస్తున్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని