రూ.7500 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు అదానీ విల్మర్‌
close

Published : 10/06/2021 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.7500 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు అదానీ విల్మర్‌

ఈ ఏడాదిలోనే జరిగే అవకాశం

దిల్లీ: ‘ఫార్చూన్‌’ బ్రాండుతో వంటనూనెలు విక్రయించే అదానీ విల్మర్‌ సంస్థ ఈ ఏడాదిలోనే తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ‘వ్యాపారం, పరిమాణం పరంగా చెప్పుకోదగిన స్థాయికి అదానీ విల్మర్‌ చేరింది. వైవిధ్యభరిత ఉత్పత్తులను విక్రయిస్తోంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదు ద్వారా రూ.7,000- 7,500 కోట్లు (100 కోట్ల డాలర్లు) సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇదే తుది విలువ కాదు.. మున్ముందు మారే అవకాశం ఉంద’ని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూపు, సింగపూర్‌కు చెందిన విల్మర్‌ల సంయుక్త సంస్థ అయిన అదానీ విల్మర్‌ 1999లో వ్యవస్థాపితమైంది. బియ్యం, గోధుమ పిండి, మైదాపిండి, రవ్వ, పప్పుధాన్యాలు ఇలా పలు రకాల విభాగాల్లోనూ వ్యాపారాలను ఇది నిర్వహిస్తోంది. 2027 కల్లా దేశంలోనే దిగ్గజ ఆహారపదార్థాల ఎఫ్‌ఎమ్‌సీజీగా అవతరించాలని కంపెనీ భావిస్తోంది. అదానీ విల్మర్‌ విలువను 8-9 బిలియన్‌ డాలర్లుగా నిర్ణయించాలని అనుకుంటున్నారని ఆ వర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని