ఆహార విక్రయ సంస్థల బిల్లులపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ నంబర్‌ తప్పనిసరి
close

Published : 11/06/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆహార విక్రయ సంస్థల బిల్లులపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ నంబర్‌ తప్పనిసరి

దిల్లీ: ఆహార వ్యాపార సంస్థల నిర్వాహకులు అక్టోబరు 1 నుంచి నగదు బిల్లులు లేదా కొనుగోలు ఇన్‌వాయిస్‌లపై తమ లైసెన్స్‌ నంబర్‌ లేదా నమోదు సంఖ్యను తప్పనిసరిగా ప్రస్తావించాలని పేర్కొంటూ ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. బిల్లులపై నిర్దిష్ట సమాచారం లేకపోవడంతో చాలా ఫిర్యాదులకు పరిష్కారం లభించడం లేదని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ జారీ చేసిన నెంబరు కనుక బిల్లుపై ఉంటే, వినియోగదార్లు సులువుగా ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసి పరిష్కారం పొందే వీలు కలుగుతుందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. లైసెన్సింగ్‌, రిజిస్ట్రేషన్‌ అధికార యంత్రాంగం ఈ కొత్త విధానాన్ని వీలైనంతగా ప్రచారంలోకి తీసుకొచ్చి 2021 అక్టోబరు 2 నుంచి కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఉత్తర్వుల్లో సూచించింది.
* 14 అంకెల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నెంబరు లేని సంస్థలన్నీ, ఆహార విక్రయానికి నమోదు కాని/గుర్తింపు లేని సంస్థలుగా భావించవచ్చని పేర్కొంది.
* ప్రస్తుతం ప్యాకేజ్డ్‌ ఆహారంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నెంబరు ముద్రించడం తప్పనిసరిగా ఉంది. అయితే కొన్ని రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాలు, క్యాటరింగ్‌ సంస్థలు, రిటైల్‌ విక్రయశాలలు కూడా ఏ విధమైన అనుమతి/నమోదు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని