వాహన రిటైల్‌ విక్రయాలు 55 శాతం తగ్గాయ్‌: ఫాడా
close

Published : 11/06/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాహన రిటైల్‌ విక్రయాలు 55 శాతం తగ్గాయ్‌: ఫాడా

దిల్లీ: దేశీయంగా వాహన రిటైల్‌ విక్రయాలు ఈ ఏడాది మే నెలలో 5,35,855కు పరిమితమయ్యాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విక్రయించిన 11,85,374 వాహనాలతో పోలిస్తే ఇది 55 శాతం తక్కువ. కొవిడ్‌ రెండోదశ కేసుల ఉద్ధృతి వల్ల ప్రతి కుటుంబంపై ప్రతికూల ప్రభావం పడటం, పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఆంక్షల వల్ల వాహన విక్రయశాలలను తక్కువ సమయం మాత్రమే తెరవడం, కొన్నిచోట్ల మూసివేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించింది. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లోనూ కొవిడ్‌ ప్రభావం అధికంగా ఉందని తెలిపింది. కొవిడ్‌ మొదటిదశ కంటే తీవ్ర ప్రభావం చూపడంతో, ఒక్కసారిగా వాహన అమ్మకాలు (వీ షేప్‌) పెరిగే పరిస్థితి ఈసారి లేదని స్పష్టం చేసింది. దేశంలో 1497 వాహన రిజిస్ట్రేషన్‌ కేంద్రాలుండగా, 1294 కేంద్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను ఫాడా విడుదల చేసింది. 

ఇవీ డిమాండ్లు: డీలర్లకు ఆర్థిక సాయం చేస్తామని టాటా మోటార్స్‌ (వాణిజ్య), రెనో, భారత్‌ బెంజ్‌, హెచ్‌ఎంఎస్‌ఐ ప్రకటించాయని, మిగిలిన సంస్థలూ ముందుకు రావాలని ఫాడా ప్రెసిడెంట్‌ వింకేశ్‌ గులాటి విజ్ఞప్తి చేశారు. రుణాలపై 90 రోజుల మారటోరియం విధించాలని బ్యాంకులను కోరారు. సాధారణంగా ఆర్థిక సంస్థలు ఇన్వెంటరీపై 30-45 రోజులకు రుణాలు ఇస్తాయని, ఇన్ని రోజుల పాటు విక్రయశాలలు తీయనందున, బకాయి చెల్లించే పరిస్థితి లేనందున నిరర్థక ఆస్తిగా మారకుండా చూడాలని సూచించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని