సిమెంట్‌ వ్యాపారానికి కొత్త అనుబంధ సంస్థ: అదానీ
close

Published : 13/06/2021 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిమెంట్‌ వ్యాపారానికి కొత్త అనుబంధ సంస్థ: అదానీ

దిల్లీ: సిమెంట్‌ తయారీ కార్యకలాపాల కోసం ‘అదానీ సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’ (ఏసీఐఎల్‌) పేరుతో ఓ పూర్తి స్థాయి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. అన్ని రకాల సిమెంట్‌ల తయారీ, ప్రాసెసింగ్‌ కార్యకలాపాలను ఇది నిర్వహిస్తుందని తెలిపింది. ‘రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌, గుజరాత్‌ వద్ద 2021, జూన్‌ 11న ఏసీఐఎల్‌ రిజిష్టర్‌ అయ్యిందని, అయితే ఈ సంస్థ కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంద’ని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఏసీఐఎల్‌ అధీకృత షేరు మూలధనం (ఆథరైజ్డ్‌ షేర్‌ కేపిటల్‌) రూ.10 లక్షలు కాగా.. చెల్లింపు మూలధనం (పెయిడ్‌ అప్‌ కేపిటల్‌) రూ.5 లక్షలు అని వెల్లడించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని