యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి సోనా కామ్‌స్టర్‌కు రూ.2,498 కోట్లు
close

Published : 13/06/2021 02:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి సోనా కామ్‌స్టర్‌కు రూ.2,498 కోట్లు

దిల్లీ: వాహన విడిభాగాల తయారీ సంస్థ సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్‌ ఫోర్జింగ్స్‌ (సోనా కామ్‌స్టర్‌) తన పబ్లిక్‌ ఇష్యూకు ముందు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.2,498 కోట్లు సమీకరించింది. ఈ సంస్థ పబ్లిక్‌ ఇష్యూ సోమవారం (రేపు) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇష్యూలో జారీ చేసే షేర్లకు రూ.285-291ను ధరల శ్రేణిగా కంపెనీ నిర్ణయించింది. ఇందులో గరిష్ఠ ధరైన రూ.291 చొప్పున 42 యాంకర్‌ ఇన్వెస్టర్లకు మొత్తం 8.6 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు బీఎస్‌ఈకి సోనాకామ్‌స్టర్‌ సమాచారం ఇచ్చింది. తద్వారా రూ.2,498 కోట్లు సమీకరించినట్లు పేర్కొంది. ప్రతిపాదిత ఇష్యూ పరిమాణమైన రూ.5,550 కోట్లలో ఈ విలువ 45 శాతం కావడం గమనార్హం. 42 యాంకర్‌ ఇన్వెస్టర్లలో 24 విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు, 11 దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, 5 జీవిత బీమా సంస్థలు, 2 ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లు ఉన్నాయి. కాగా. ఎస్‌బీఐ కార్డ్స్‌, పవర్‌గ్రిడ్‌ ఇన్విట్‌ తర్వాత యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి అత్యధికంగా నిధులు సమీకరించిన సంస్థ సోనా కామ్‌స్టర్‌నే. ఎస్‌బీఐ కార్డ్స్‌ రూ.2,769 కోట్లు, పవర్‌గ్రిడ్‌ ఇన్విట్‌ రూ.3,480 కోట్లు సమీకరించాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని