పసిడి దిద్దుబాటు!
close

Published : 14/06/2021 02:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసిడి దిద్దుబాటు!

కమొడిటీస్‌
ఈ వారం

బంగారం

సిడి ఆగస్టు కాంట్రాక్టు రూ.49,460 స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైనందున.. ఈవారం కూడా ప్రతికూల ధోరణిలోనే చలించే అవకాశం ఉంది. రూ.48,579 వద్ద కాంట్రాక్టుకు మద్దతు దొరకవచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.48,278 వరకు పడిపోతుందని భావించవచ్చు. ఈ నేపథ్యంలో రూ.49,358 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.48,579; రూ.48,392 లక్ష్యాలతో రూ.49,156 దిగువన కాంట్రాక్టుకు షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. సాంకేతికత అంశాలతో పాటు అమెరికా విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాలు, డాలరు కదలికలు, దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.15,355 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే రూ.15,162; రూ.15,068 వరకు దిగిరావచ్చు. ఈ నేపథ్యంలో రూ.15,426 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.15,318 సమీపంలో కాంట్రాక్టుకు షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.


వెండి

వెండి జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.73,050 వద్ద నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే కాంట్రాక్టు మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.71,533 కంటే దిగువన ట్రేడయితే రూ.71,116; రూ.70,566 వరకు కాంట్రాక్టు దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు. రూ.73,050 ఎగువన మాత్రం షార్ట్‌ సెల్లింగ్‌ జోలికి వెళ్ళకపోవడమే మంచిది.


  ప్రాథమిక లోహాలు

ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ జూన్‌ కాంట్రాక్టు రూ.14,934 కంటే దిగువన కదలాడకుంటే, మరింతగా రాణించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ స్థాయి కింటే కిందకు వస్తే రూ.14,619 వరకు పడిపోవచ్చు.
* రాగి జూన్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.769 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, షార్ట్‌ సెల్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు. ఒకవేళ రూ.769 స్థాయిని అధిగమిస్తే మాత్రం రూ.782 వరకు కాంట్రాక్టు పెరిగే అవకాశం ఉంటుంది.
సీసం జూన్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.175.40 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.170.15 లక్ష్యంతో రూ.172.85- రూ.174.35 మధ్యలో కాంట్రాక్టుకు షార్ట్‌ సెల్‌పొజిషన్లు తీసుకోవచ్చు.
జింక్‌ జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.244.95 కంటే ఎగువన ట్రేడ్‌కాకుంటే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్థాయి వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని షార్ట్‌ సెల్‌ చేయొచ్చు.
అల్యూమినియం జూన్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.198 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, షార్ట్‌ పొజిషన్లను కొనసాగించడం మంచిదే.
నికెల్‌ జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.1,304 కంటే దిగువకు రాకుంటే రూ.1,366; ఆ తర్వాత రూ.1,377 వరకు పెరిగే అవకాశం ఉంది.


  ఇంధన రంగం

సహజ వాయువు జూన్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.258.45 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.252- 254.65 సమీపంలో షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.
ముడి చమురు జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.5,328 ఎగువన కదలాడకుంటే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ స్థాయి వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.5,285- రూ.5,318 సమీపంలో షార్ట్‌ సెల్‌చేయడం మంచిదే.
ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) జూన్‌ కాంట్రాక్టును ఈవారం రూ.1,162 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని షార్ట్‌సెల్‌ చేయొచ్చు.


  వ్యవసాయ ఉత్పత్తులు

పసుపు జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.8,023కి స్టాప్‌లాస్‌ను సవరించుకుని, షార్ట్‌ సెల్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు. అయితే రూ.7,751; రూ.7,653 స్థాయికి దిగివచ్చాక లాభాలు స్వీకరించడం మంచి వ్యూహం అవుతుంది.
జీలకర్ర జులై కాంట్రాక్టు ఈవారం రూ.13,740 కంటే దిగువన ట్రేడయితే.. దిద్దుబాటు కొనసాగుతుందని భావించవచ్చు. రూ.13,915కి స్టాప్‌లాస్‌ మార్చుకుని ప్రస్తుత షార్ట్‌ సెల్‌ పొజిషన్లను అట్టేపెట్టుకోవడం మేలే.
సోయాబీన్‌ జులై కాంట్రాక్టు ఈవారం రూ.6,887 కంటే ఎగువన కదలాడకుంటే.. రూ.6,602; రూ.6,466 లక్ష్యాలతో ధర పెరిగినప్పుడల్లా కాంట్రాక్టుకు షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని