16000 పాయింట్ల దిశగా నిఫ్టీ!
close

Published : 14/06/2021 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

16000 పాయింట్ల దిశగా నిఫ్టీ!

సూచీలకు రక్షణాత్మక షేర్ల అండ రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి
యంత్ర పరికరాలు, ఐటీ షేర్లు రాణించొచ్చు విశ్లేషకుల అంచనాలు

స్టాక్‌ మార్కెట్‌

ఈ వారం

దేశీయ మార్కెట్లు ఈ వారం కొత్త శిఖరాలను అధిరోహించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ-50 16000 పాయింట్ల స్థాయిని పరీక్షించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే షేర్ల విలువలు అధికంగా ఉండటంతో.. గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాల ఒత్తిడిఎదురుకావొచ్చనీ హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో మంగళవారం ప్రారంభం కానున్న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రెండురోజుల పరపతి విధాన సమీక్షా సమావేశ నిర్ణయాల కోసం ప్రపంచవ్యాప్తంగా మదుపర్లు వేచిచూస్తున్నారు. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ వంటి రక్షణాత్మక షేర్లను నిపుణులు సూచిస్తున్నారు. మే రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు, ఆర్‌బీఐ ఇటీవలి ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల మినిట్స్‌ శుక్రవారం వెలువడనున్నాయి. నిఫ్టీ కంపెనీల్లో కోల్‌ ఇండియా నేడు ఫలితాలు ప్రకటించనుంది. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..


యంత్ర పరికరాల షేర్లు సానుకూలంగా కనిపిస్తున్నాయి. పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం ఇందుకు కలిసిరావొచ్చు. ఫలితాల నేపథ్యంలో భెల్‌ షేరు బలహీనపడొచ్చు.
మార్కెట్‌ నుంచి ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు సంకేతాలు తీసుకోవచ్చు. బలహీన గిరాకీపై ఆందోళనలు ఈ కంపెనీలపై ప్రభావం చూపొచ్చు. ముడి వస్తువుల ధరలు పెరగడంతో స్వల్పకాలంలో స్థూల మార్జిన్‌లపై ఒత్తిడి పడొచ్చు.
చమురు కంపెనీల షేర్లు అంతర్లీనంగా సానుకూల ధోరణితో స్థిరీకరించుకోవచ్చు. రిఫైనరీ కంపెనీ షేర్లతో పోలిస్తే అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లు రాణించే అవకాశం ఉంది. ముడిచమురు ధరలు కీలకం కానున్నాయి.
* రంగం ఆధారిత పరిణామాలు లేకపోవడంతో మార్కెట్ల నుంచి వాహన కంపెనీల షేర్లు సంకేతాలందుకోవచ్చు.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిస్తున్నందున, నిర్మాణ కార్యకలాపాలు పుంజుకుని సిమెంట్‌ షేర్లు రాణించే అవకాశం ఉంది. అయితే వర్షాకాలం ప్రారంభంతో కార్యకలాపాలు మళ్లీ నెమ్మదించొచ్చు.
* మదుపర్లు రక్షణాత్మక షేర్లకు మొగ్గు చూపుతుండటంతో ఐటీ షేర్ల జోరు కొనసాగొచ్చు. వార్షిక సాధారణ సమావేశం నేపథ్యంలో సైయెంట్‌ షేరు వెలుగులోకి రావొచ్చు.
* కొవిడ్‌-19 ప్రభావంతో రుణాల వృద్ధి తగ్గొచ్చన్న అంచనాలతో బ్యాంకింగ్‌ షేర్లు మందకొడిగా కదలాడొచ్చు. కొన్ని బ్యాంకులు మాత్రం సానుకూలంగా ట్రేడవ్వొచ్చు. బ్యాంక్‌ నిఫ్టీకి 34600 పాయింట్ల వద్ద మద్దతు కనిపిస్తోంది.
* ఇటీవల భారీగా పెరగడంతో లోహ, గనుల కంపెనీల షేర్లు స్తబ్దుగా ఉండొచ్చు. ప్రస్తుత స్థాయుల నుంచి ఉక్కు ధరలు కిందకు రావొచ్చని అంటున్నారు.
* ఔషధ షేర్లు లాభపడొచ్చు. బ్యాంకుల వంటి సైక్లికల్‌ షేర్లలో లాభాల స్వీకరణ రావడంతో ఈ రంగ షేర్లకు మళ్లీ కొనుగోళ్లు రావొచ్చు.
* తీవ్ర పోటీ నేపథ్యంలో టెలికాం రంగంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. ఏజీఎంకు ముందు ఆర్‌ఐఎల్‌ షేరు రాణించొచ్చు. భారతీ ఎయిర్‌టెల్‌ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

 


 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని