జీవన కాల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
close

Published : 15/06/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీవన కాల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

మేలో 12.94%

దిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది మే నెలలో 12.94 శాతానికి చేరింది. ఇది జీవన కాల గరిష్ఠస్థాయి. ముడి చమురు, తయారీ వస్తువుల ధరలు పెరగడంతో పాటు  గత ఏడాది మేలో ఇది - 3.37 శాతంగా నమోదు కావడంతో, ఈసారి బాగా పెరిగినట్లు నమోదైంది. 2021 ఏప్రిల్‌లోనూ డబ్ల్యూపీఐ 10.49 శాతంగా నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం పెరగడం వరుసగా ఇది అయిదో నెల.
* అంతర్జాతీయంగా కమొడిటీ ధరలు పెరగడంతో ఇంధనం, విద్యుత్తు ద్రవ్యోల్బణం వరుసగా 37.61 శాతం, 20.94 శాతం మేర పెరిగాయి.
* తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2021 ఏప్రిల్‌ నాటి 9.01 శాతం నుంచి 10.83 శాతానికి చేరింది.
* ఉల్లి ధరలు పెరిగినా ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి, 4.31 శాతంగా నమోదైంది.  
రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.3%
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో 6 నెలల గరిష్ఠమైన 6.3 శాతానికి చేరింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించుకున్న సౌకర్యవంత ద్రవ్యోల్బణ స్థాయిని (2-6 శాతం) మించి ఇది ఉంది. 2020 నవంబరులో నమోదైన 6.93 శాతం తరవాత మళ్లీ ఇదే గరిష్ఠం. కీలక రేట్లను నిర్ణయించే ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశమవుతున్న 2016 అక్టోబరు (తొలి సమావేశం) నుంచి ద్రవ్యోల్బణ లక్ష్యానికి (2-6 శాతం) మించి నమోదు కావడం ఇది 10వ సారి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు కారణమని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. సీపీఐ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌లో 4.23 శాతంగా నమోదైంది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.96 శాతం కాగా, మేలో అది 5.01 శాతానికి చేరింది. 2021-22 మొత్తంమీద సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా నమోదు కావొచ్చన్నది ఆర్‌బీఐ అంచనా.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని