పెరిగిన ఎస్‌బీఐ బేస్‌ రేటు
close

Published : 15/06/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెరిగిన ఎస్‌బీఐ బేస్‌ రేటు

నేటి నుంచి అమలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన బేస్‌ రేటు, ప్రైమ్‌ లెండింగ్‌ రేటును 10 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచింది. ఎంసీఎల్‌ఆర్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పెరిగిన రేట్లు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త మార్పుతో బేస్‌ రేటు 7.50 శాతం, ప్రైమ్‌ లెండింగ్‌ రేటు 12.25 శాతానికి చేరినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఈ రేటు ఒక రోజుకు 6.65% మూడేళ్లకు 7.30% ఉంది. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.00శాతంగా ఉంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని