హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యాప్‌ ఒక గంట పని చేయలేదు
close

Updated : 16/06/2021 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యాప్‌ ఒక గంట పని చేయలేదు

ముంబయి: ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌ మంగళవారం ఉదయం ఒక గంట పాటు పని చేయకపోవడంతో ఖాతాదార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆన్‌లైన్‌ సేవల్లో తలెత్తిన సాంకేతిక లోపాలపై నియంత్రణ సంస్థలు దృష్టి సారించిన సంగతి విదితమే. వ్యవస్థలను మెరుగు పరచాలని ఆదేశించడంతో పాటు, కొన్ని రకాల కొత్త సేవల ప్రారంభం పైనా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది కూడా. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాంక్‌ యాప్‌ పనిచేయకపోవడం గమనార్హం. ‘ఉదయం ఒక గంట పాటు యాప్‌లో సమస్య తలెత్తింది. ఈ సమయంలో ప్రత్యామ్నాయంగా నెట్‌ బ్యాంకింగ్‌ వినియోగించుకోవాలని ఖాతాదార్లను కోరాం. తరవాత సమస్య పరిష్కారమైంద’ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతి రాజీవ్‌ బెనర్జీ ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని