పసిడి ఈటీఎఫ్‌ పెట్టుబడుల్లో 57% క్షీణత
close

Updated : 16/06/2021 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసిడి ఈటీఎఫ్‌ పెట్టుబడుల్లో 57% క్షీణత

దిల్లీ: గత నెలలో పసిడి ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ల (ఈటీఎఫ్‌)లోకి పెట్టుబడులు 57 శాతం తగ్గి రూ.288 కోట్లకు పరిమితమయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలోకి మదుపర్లు సొమ్ము మళ్లించడమే ఇందుకు కారణం. యాంఫీ (అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో పసిడి ఈటీఎఫ్‌ల్లోకి రూ.680 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది మార్చిలో రూ.662 కోట్లు, ఫిబ్రవరిలో రూ.491 కోట్లు, జనవరిలో రూ.625 కోట్ల చొప్పున వీటిల్లో మదుపర్లు పెట్టుబడులు పెట్టారు. గత నెలలో పెట్టుబడులు తగ్గినప్పటికీ.. పసిడి ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 6 శాతానికి పైగా పెరిగి రూ.16,625 కోట్లకు చేరాయి. ఏప్రిల్‌లో ఈ మొత్తం రూ.15,629 కోట్లుగా ఉంది. 2020 జనవరి నుంచి 2021 మే మధ్య పసిడి ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా రూ.9,377 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.


సైయెంట్‌ ‘మొబియస్‌’ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్‌ అజూరే ప్లాట్‌ఫామ్‌ మీద యుటిలిటీ కంపెనీలకు అనువైన మొబియస్‌ సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) ఆధారిత సొల్యూషన్‌ను సైయెంట్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసింది. అవుటేజ్‌ ప్లానింగ్‌, షెడ్యూలింగ్‌లో యుటిలిటీ కంపెనీలకు ఈ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సైయెంట్‌ ప్రోడక్ట్స్‌ ఓనర్‌ కింబెర్లే రీడ్‌ వివరించారు.


 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని