పిట్టీ ఇంజినీరింగ్‌కు రూ.21.66 కోట్ల ప్రోత్సాహకాలు
close

Updated : 16/06/2021 10:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిట్టీ ఇంజినీరింగ్‌కు రూ.21.66 కోట్ల ప్రోత్సాహకాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల సంస్థ పిట్టీ ఇంజినీరింగ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.21.66 కోట్ల ప్రోత్సాహకాలు లభించాయి. 2013లో ఔరంగాబాద్‌లో రూ.160 కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని సంస్థ నెలకొల్పింది. ప్యాకేజ్‌ స్కీం ఆఫ్‌ ఇన్సెంటివైజ్‌ (పీఎస్‌ఐ) కింద ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును ఆ రాష్ట్ర ప్రభుత్వం మెగా ప్రాజెక్టుగా ప్రకటించడంతో ఈ ప్రోత్సాహక మొత్తం లభించిందని పిట్టీ తెలిపింది. తొలి దశలో రూ.16.25 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించింది. ప్రభుత్వం, కంపెనీ మధ్య ఉన్న ఒప్పందం, నిబంధనల మేరకు రూ.138.34 కోట్లు కూడా దశల వారీగా వెనక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మొత్తంతో కంపెనీ లాభాలు పెరగడంతో పాటు, నగదు లభ్యత వల్ల కంపెనీ విస్తరణకూ తోడ్పడుతుందని సంస్థ సీఎండీ అక్షయ్‌ పిట్టీ తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని