బ్యాడ్‌ బ్యాంకులో 12% వాటా తీసుకుంటాం
close

Updated : 16/06/2021 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాడ్‌ బ్యాంకులో 12% వాటా తీసుకుంటాం

ప్రధాన ప్రాయోజితసంస్థగా వ్యవహరిస్తాం: కెనరా బ్యాంక్‌

దిల్లీ: నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌)/బ్యాడ్‌ బ్యాంక్‌లో 12 శాతం వాటా తీసుకోవడం ద్వారా ప్రధాన ప్రాయోజిత సంస్థగా (లీడ్‌ స్పాన్సర్‌) వ్యవహరిస్తామని కెనరా బ్యాంక్‌ మంగళవారం పేర్కొంది. పరిష్కార ప్రణాళికలో ఉన్న రుణదాతల మొండి బకాయిలను కొనుగోలు చేసి, వాటికి పరిష్కారం చూపించే ఆర్థిక సంస్థగా బ్యాడ్‌ బ్యాంక్‌ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్‌ఏఆర్‌సీఎల్‌లో స్పాన్సర్‌గా చేరాలని కెనరా బ్యాంక్‌ను కోరుతూ మే 13న ది ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) లేఖ రాసింది. ఇందుకు తమ బ్యాంక్‌ బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు కెనరా బ్యాంక్‌ నియంత్రణ సంస్థలకు సమాచారమిచ్చింది. ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకుని, 12 శాతం వాటాను ఎన్‌ఏఆర్‌సీఎల్‌లో తీసుకుని స్పాన్సర్‌ బ్యాంక్‌గా వ్యవహరిస్తామని తెలిపింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) చెప్పుకోదగ్గ స్థాయిలో తమ ఎన్‌పీఏలను ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) తమ రూ.8,000 కోట్ల ఎన్‌పీఏలను బదిలీ చేస్తామని ఇప్పటికే తెలిపింది. ఎన్‌ఏఆర్‌సీఎల్‌లో 51 శాతం వాటాను పీఎస్‌బీలు, మిగతాది ప్రైవేటు రంగ బ్యాంకులు తీసుకోనున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని