హైదరాబాద్‌ కేంద్రాన్ని   విస్తరించనున్న యూఎస్‌టీ
close

Updated : 16/06/2021 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌ కేంద్రాన్ని   విస్తరించనున్న యూఎస్‌టీ

రెండేళ్లలో మరో 1,000 ఉద్యోగాలు

ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సేవల సంస్థ యూఎస్‌టీ, హైదరాబాద్‌లోని తన అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించనుంది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 1,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, దీన్ని 2023 సంవత్సరాంతానికి 2,000 మందికి పెంచాలని నిర్ణయించింది. మూడేళ్ల క్రితం 250 మంది ఉద్యోగులతో మొదలు పెట్టి ఇప్పుడు వెయ్యి మంది ఉద్యోగుల స్థాయికి చేరామని, ఇక్కడి నుంచి ఇంకా వేగంగా విస్తరించనున్నట్లు యూఎస్‌టీ హైదరాబాద్‌ కేంద్రం కార్యకలాపాల అధిపతి హరిలాల్‌ నీలకంఠన్‌ తెలిపారు. యూఎస్‌టీకి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అన్నారు. ఈ సంస్థకు బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, కోచి, పుణె, కోయంబత్తూర్‌, హోసూర్‌,  దిల్లీల్లో కూడా డెలివరీ సెంటర్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని