ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్‌కు పాన్‌, ఆధార్‌ చాలు
close

Published : 16/06/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్‌కు పాన్‌, ఆధార్‌ చాలు

ఈనాడు, దిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సరళతరం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించారు. వీటి రిజిస్ట్రేషన్‌కు పాన్‌, ఆధార్‌ నెంబర్‌ సరిపోతాయని పేర్కొన్నారు. ఎస్‌ఎంఈ స్ట్రీట్‌ గేమ్‌ఛేంజర్స్‌ ఫోరమ్‌ మంగళవారం నిర్వహించిన వెబినార్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈవిషయం వెల్లడించారు. పాన్‌, ఆధార్‌ ఉపయోగించి నమోదు చేసుకున్న ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు ప్రభుత్వపరంగా చేయూతనందించడంలో, ఆర్థిక వనరులు సమకూర్చడంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్లు చిన్న వ్యాపారాలకు పూర్తిస్థాయి మద్దతు ఇస్తాయని చెప్పారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని