రెమ్‌డెసివిర్‌ ఎగుమతులపై నిషేధాన్ని సడలించిన కేంద్రం
close

Published : 16/06/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెమ్‌డెసివిర్‌ ఎగుమతులపై నిషేధాన్ని సడలించిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించే రెమ్‌డెసివిర్‌ ఔషధ ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సడలించింది. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌తో పాటు, రెమ్‌డెసివిర్‌ ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్‌) పై ఇప్పటివరకు నిషేధం అమల్లో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారం నుంచి మే చివరివరకు దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసులు ఎంతో అధికంగా నమోదైన విషయం విదితమే. కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వారిలో ఎంతో మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సి వచ్చింది. వారికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ వినియోగించాల్సి రావటంతో ఈ మందుకు కొరత ఏర్పడింది. దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను నిషేధించింది. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడం, అదే సమయంలో తమ వద్ద రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఇవ్వాలని ఔషధ కంపెనీలు కోరడంతో కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని సడలించింది. తాజాగా ‘నిషేధిత జాబితా’ నుంచి ఈ ఔషధాన్ని తొలగించి ‘నియంత్రిత జాబితా’లో చేర్చింది. అంటే కొన్ని పరిమితులకు లోబడి దీన్ని ఎగుమతి చేయొచ్చు. ఈ ఔషధం విషయంలో ఫార్మా కంపెనీల అభిప్రాయాలను హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మాగ్జిల్‌ (ఫార్మాసూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌), డీజీఎఫ్‌టీ (డైరెక్టర్‌ జనరల్‌ ఫారిన్‌ ట్రేడ్‌) కి నివేదించింది. తద్వారా సానుకూల ఫలితాన్ని రాబట్టగలిగినట్లు ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ వివరించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని