భారతీయుల సంపద రూ.255 లక్షల కోట్లు
close

Published : 16/06/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారతీయుల సంపద రూ.255 లక్షల కోట్లు

2020లో 11 శాతం వృద్ధి
బీసీజీ నివేదిక

ముంబయి: కొవిడ్‌ మహమ్మారి వేధిస్తున్నా భారతీయుల ఆర్థిక సంపద 2020లో 11 శాతం మేర వృద్ధి చెంది 3.4 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.255 లక్షల కోట్లు) చేరిందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ బీసీజీ తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్థిక సంపద అంటే వయోజన వ్యక్తుల వద్ద ఉన్న వాస్తవ ఆస్తులు, అప్పులను మినహాయించి మిగిలిన మొత్తం సంపద. కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో గతేడాది తొలుత బాగా దిద్దుబాటుకు గురైనా, ఏప్రిల్‌ నుంచి స్టాక్స్‌లో కనిపించిన భారీ ర్యాలీతో  ఆర్థిక సంపద విలువ బాగా పెరిగిందని నివేదిక తెలిపింది. వచ్చే కొన్నేళ్ల పాటు ఆర్థిక సంపద వేగంగా పెరుగుతుందని, అయితే పెరుగుదల రేటు కొంచెం తగ్గి ఏడాదికి 10 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసింది. 2025 నాటికి ఆర్థిక సంపద 5.5 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చని పేర్కొంది. వచ్చే 5 ఏళ్లలో దేశంలో 100 మిలియన్‌ డాలర్లకు పైగా సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య రెండింతలై 1,400కు చేరే అవకాశం ఉందని తెలిపింది. భారతీయుల క్రాస్‌-బార్డర్‌ వెల్త్‌ 2020లో 19,400 కోట్ల డాలర్ల మేర పెరిగిందని, ఇది మొత్తం ఆర్థిక సంపదలో 5.7 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది. 2025 నాటికి ఇది కూడా 6.3 శాతానికి చేరొచ్చని తెలిపింది. వాస్తవ ఆస్తులైన స్థిరాస్తి, మన్నికైన వినిమయ వస్తువులు, పసిడి, ఇతర లోహాలను ప్రస్తుత ధరల వద్ద లెక్కిస్తే 2019 కంటే 2020లో 14 శాతానికి పైగా పెరిగి 12.4 లక్షల కోట్ల డాలర్లకు చేరాయని వివరించింది. 2025 నాటికి ఈ స్థిరాస్తుల విలువ కూడా 8.2 శాతం వృద్ధితో 18.5 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని