3.2 సెకన్లలో 100 కి.మీ వేగం
close

Updated : 16/06/2021 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3.2 సెకన్లలో 100 కి.మీ వేగం

రూ.17.9-22.5 లక్షల శ్రేణిలో బీఎండబ్ల్యూ కొత్త బైక్‌లు

దిల్లీ: జర్మన్‌ విలాసవంత వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త బీఎండబ్ల్యూ ఎస్‌ 1000 ఆర్‌ మోటార్‌ సైకిల్‌ను భారత విపణిలోకి మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.17.9 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). రెండో తరం బీఎండబ్ల్యూ ఎస్‌ 1000 ఆర్‌ బైక్‌లు కంప్లీట్లీ బిల్టప్‌ యూనిట్‌గా (సీబీయూ) దిగుమతి అవుతాయని, బీఎండబ్ల్యూ మోటార్డ్‌ ఇండియా విక్రయ కేంద్రాల్లో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. వాటర్‌ కూల్డ్‌ 4-సిలిండర్‌ ఇన్‌-లైన్‌ ఇంజిన్‌, 999 సీసీతో దీన్ని రూపొందించారు. 165 హెచ్‌పీ సామర్థ్యం, 11,000 ఆర్‌పీఎం దీని సొంతం. 3.2 సెకన్లలోనే 100 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. గరిష్ఠంగా 250 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. ఈ బైక్‌లు మూడు వేరియంట్లలో లభ్యమవుతాయి. స్టాండర్డ్‌ ధర రూ.17.9 లక్షలు, ప్రొ ధర రూ.19.75 లక్షలు, ప్రొ ఎం స్పోర్ట్‌ ధర రూ.22.5 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) అని కంపెనీ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని