కొవిడ్‌ 2వ దశ.. రూ.2 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టం
close

Published : 18/06/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ 2వ దశ.. రూ.2 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టం

ఆర్‌బీఐ అంచనా

ముంబయి: కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి పరిణామాల ఫలితంగా ఏప్రిల్‌- మే నెలల్లో దేశీయంగా రూ.2 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టం సంభవించిందనే అంచనాను రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తాజా నివేదికలో వ్యక్తం చేసింది. కొవిడ్‌ మొదటిదశలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలు కాగా, రెండో దశలో రాష్ట్రాలు, కంటైన్‌మెంట్‌ జోన్లకే ఆంక్షలు పరిమితమయ్యాయని వివరించింది. ఈసారి చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా కొవిడ్‌ వ్యాప్తి తీవ్రమై, గిరాకీ మందగించిందని తెలిపింది. అయితే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, ప్రత్యక్షంగా కలిసే అవసరం లేకుండా డిజిటల్‌ సేవలు అందడం ఈసారి పరిస్థితులను కొంత సానుకూల పరిచాయంది. టీకా ఎంత త్వరగా అందితే, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం అంత బాగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వైరస్‌ ఇప్పుడే పూర్తిగా తొలగే అవకాశం లేనందున, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పరిశోధనల్లో పెట్టుబడులు పెరిగి, జీవన నాణ్యతను మెరుగు పరచాల్సి ఉందని స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని