నాట్కో ఫార్మాకు రూ.360 కోట్ల ఆదాయం
close

Published : 18/06/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాట్కో ఫార్మాకు రూ.360 కోట్ల ఆదాయం

ఈనాడు, హైదరాబాద్‌: నాట్కో ఫార్మా ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికానికి రూ.359.7 కోట్ల ఆదాయాన్ని, రూ.53 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2019-20 ఇదేకాలంలో ఆదాయం రూ.477.2 కోట్లు, నికరలాభం రూ.93.2 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21) పూర్తికాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం ఆదాయం రూ.2,155.7 కోట్లు, నికరలాభం రూ.442.4 కోట్లు నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఆదాయం 6.6% పెరిగింది. కానీ నికరలాభం 3.4 % తగ్గింది. కొవిడ్‌-19 వల్ల వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం పడినా, ఆదాయాలు కాపాడుకోగలిగినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఆదాయాలు నమోదు చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అమెరికాలో అధిక విలువ గల పలు ఔషధాలను విడుదల చేయబోతున్నామని, దేశీయ మార్కెట్లోనూ అమ్మకాలు పెరుగుతున్నట్లు వివరించింది. తమ ‘క్రాప్‌ హెల్త్‌ డివిజన్‌’ నుంచి క్రిమిసంహారక మందులు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని