3 రోజులు.. రూ.67,000 కోట్ల నష్టం
close

Published : 18/06/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 రోజులు.. రూ.67,000 కోట్ల నష్టం

భారీగా పడిపోయిన అదానీ సంపద

దిల్లీ: గత కొన్ని నెలలుగా అప్రతిహతంగా సాగిన గౌతమ్‌ అదానీ సంపద సృష్టికి అడ్డుకట్ట పడింది. అదానీ గ్రూప్‌నకు చెందిన ఆరు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో సంస్థ (ఎఫ్‌పీఐ)ల ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్‌ స్తంభింప చేసిందనే వార్తలతో, ఈ కంపెనీలు షేర్ల విలువలు గణనీయంగా క్షీణించడమే ఇందుకు కారణం. గత వారం రోజుల్లో చూస్తే.. అత్యధికంగా సంపద పోగొట్టుకున్న వ్యక్తిగా గౌతమ్‌ అదానీ నిలిచారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం.. ఆయన వ్యక్తిగత సంపద 9 బి.డాలర్లు (దాదాపు రూ.67,000 కోట్లు) తగ్గి 67.6 బి.డాలర్ల (దాదాపు రూ.5 లక్షల కోట్ల)కు పరిమితమైంది. కొద్ది రోజుల క్రితం ఆసియా కుబేరుల్లో ముకేశ్‌ అంబానీకి అదానీ చేరువయ్యారు. ఈ నెల ప్రారంభంలో అదానీ సంపద విలువ 80 బి.డాలర్ల వరకు వెళ్లింది. అయితే గత మూడు రోజుల్లో తన గ్రూప్‌ షేర్ల విలువ క్షీణించడంతో, అదానీ సంపద విలువ కూడా భారీగా తగ్గింది. అదానీ గ్రూప్‌తో పాటు ఎన్‌ఎస్‌డీఎల్‌ కూడా ఎఫ్‌పీఐ ఖాతాలు స్తంభింప చేయలేదని వివరణ ఇచ్చినప్పటికీ.. షేర్ల పతనం మాత్రం ఆగలేదు. ఈ వారం అదానీ గ్రీన్‌ 7.7%, అదానీ పోర్ట్స్‌ 23%, అదానీ పవర్‌, అదానీ టోటల్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 18%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 15% వరకు నష్టాలు చవిచూశాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని