యమహా ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌
close

Updated : 19/06/2021 07:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యమహా ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌

దిల్లీలో ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.1,16,800

దిల్లీ: జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం యమహా శుక్రవారం తమ తొలి నియో-నెట్రో మోటార్‌సైకిల్‌ ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,16,800 (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ). ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. బ్లూటూత్‌ లేకుండా రూ.1,16,800, బ్లూటూత్‌ సదుపాయంతో రూ.1,19,800లుగా ధర నిర్ణయించింది. ఈ మోడల్‌ ఎయిర్‌కూల్డ్‌ 4-స్ట్రోక్‌, 149 సీసీ ఇంజిన్‌, 12.4 పీఎస్‌, 7,250 ఆర్‌పీఎం గరిష్ఠ సామర్థ్యంతో రూపొందినట్లు యమహా తెలిపింది. హైబ్రిడ్‌ వేరియంట్‌ స్కూటర్‌ మోడల్‌ ఫాసినో 125ను కూడా తీసుకొచ్చింది.  ఈ స్కూటర్‌ ధర, ఇతర వివరాలను వెల్లడించలేదు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని