యునిలీవర్‌
close

Published : 20/06/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యునిలీవర్‌

కాగితపు డిటర్జెంట్‌ బాటిల్‌

ప్రపంచంలోనే తొలిసారిగా.. లాండ్రీ డిటర్జెంట్‌ సీసాను కాగితంతో రూపొందించడానికి ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం యునిలీవర్‌ సన్నాహాలు చేస్తోంది. అగ్రగామి లాండ్రీ బ్రాండ్‌ ఓఎంఓ (పెర్సిల్‌, స్కిప్‌ అండ్‌ బ్రీజ్‌గా ప్రాచుర్యం) కోసం అభివృద్ధి చేసిన ఈ నమూనాను.. 2022 ప్రారంభంలో బ్రెజిల్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఐరోపా, ఇతర దేశాల్లో ఆ తర్వాత తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. షాంపూలు, నూనెల వంటి కేశసంరక్షణ ద్రవాలను నింపే సీసాలను సైతం ఇదే పరిజ్ఞానంతో రూపొందించాలని యునిలీవర్‌ భావిస్తోంది. యునిలీవర్‌, డియాజియో, పైలట్‌ లైట్‌, ఇతర పరిశ్రమ సభ్యులతో ఏర్పాటైన పల్పెక్స్‌ కన్సార్షియం భాగస్వామ్యంతో ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. కాగితపు గుజ్జు, ఇతర వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయడం ద్వారా పేపర్‌ బాటిళ్లను తయారుచేస్తారు. లాండ్రీ డిటర్జెంట్‌, షాంపూ, కండీషనర్లు, సుగంధ ద్రవ్యాలు వంటి ద్రవ రూప ఉత్పత్తులను పేపర్‌ బాటిళ్లలో ఉంచేందుకు లోపల భాగంలో ప్రోప్రీటరీ కోటింగ్‌ను స్ప్రే చేస్తారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్యను అధిగమించేందుకు.. ప్యాకేజ్‌ ఉత్పత్తుల విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు సమూల మార్పులు అవసరమని, పరిశ్రమలో అందరూ సహకరించుకోవాలని యునిలీవర్‌ చీఫ్‌ ఆర్‌ అండ్‌ డీ ఆఫీసర్‌ రిచర్డ్‌ స్లేటర్‌ పేర్కొన్నారు. ఈ కొత్త పరిజ్ఞానాన్ని ఇతర ఉత్పత్తుల్లో సైతం వినియోగించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని