భారత్‌లో 19,230 ఉద్యోగాలిస్తాం
close

Published : 20/06/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 19,230 ఉద్యోగాలిస్తాం

విదేశాల్లో 1941 మందికి: ఇన్ఫోసిస్‌

దిల్లీ: భారత్‌లో 19,230 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం ద్వారా తమ సిబ్బందిని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని పేర్కొన్నారు. క్లయింట్ల నుంచి పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా భారత్‌ వెలుపల 1,941 మందిని తీసుకోనున్నట్లు ఆయన   వివరించారు. ‘2022 కల్లా అమెరికాలో 25,000 మందిని నియమించుకుంటాం. అదనంగా 12,000 కొత్త ఉద్యోగాలివ్వడం ద్వారా అమెరికా నియామకాలను విస్తరిస్తున్నామ’ని తెలిపారు. కెనడాలోనూ 2023 కల్లా సిబ్బందిని రెండింతలు చేసి 4,000కు చేరుస్తాం. బ్రిటన్‌లో 1,000 డిజిటల్‌ ఉద్యోగాలను సృష్టించాలనుకుంటున్నామ’ని వివరించారు.

వచ్చే నెల నుంచి వేతన పెంపు: జులై 2021 నుంచి అమల్లోకి వచ్చేలా ఇన్ఫోసిస్‌ వేతన పెంపును ప్రకటించింది. ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో ఇది రెండో పెంపు. వలసల రేటును తగ్గించడం కోసం, నైపుణ్యాలున్న సిబ్బందిని కాపాడుకోవడం కోసం కంపెనీ ఈ చర్యలు చేపట్టింది.

ఇఫైలింగ్‌ కొత్త పోర్టల్‌ సమస్యల్ని పరిష్కరిస్తాం: ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్‌ కొత్త పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా కలిగిన అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ పేర్కొంది. పన్ను చెల్లింపుదార్లకు మరింత సౌలభ్యంగా ఉండేలా జూన్‌ 7న తీసుకొచ్చిన పోర్టల్‌లో తలెత్తిన పలు సమస్యలను పరిష్కరించినట్లు సీఓఓ ప్రవీణ్‌రావు తెలిపారు. మరికొన్నిటికి రాబోయే కొద్ది వారాల్లో పరిష్కారం చూపనున్నట్లు వివరించారు.ఇప్పటికే లక్ష వరకు రిటర్నులు ఫైల్‌ అయినట్లు పేర్కొన్నారు.

హెచ్‌1బీ అనుమతులు పెరిగాయి: 2020-21 తొలి త్రైమాసికం నుంచి అమెరికాలో హెచ్‌1బీ వీసాల దరఖాస్తులకు అనుమతులు ఇచ్చే రేటు పెరిగిందని ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఈ వీసాలు పొందిన వారు భారీ సంఖ్యలో తమ వద్ద ఉన్నారని క్లయింట్లకు మద్దతు ఇచ్చేందుకు అమెరికాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లూ వివరించింది. మరో వైపు, అమెరికాలో 65 శాతం స్థానిక ఉద్యోగుల్నే నియమించుకున్నట్లూ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని