సహజవాయువుకు అమ్మకాల సెగ!
close

Published : 21/06/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సహజవాయువుకు అమ్మకాల సెగ!

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం, వెండి

పసిడి ఆగస్టు కాంట్రాక్టును ఈవారం రూ.48,816 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.46,062; రూ.45,693 లక్ష్యాలతో రూ.48,144 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.

ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ జులై కాంట్రాక్టు ఈవారం రూ.14,694 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే రూ.14,474; రూ.14,235 వరకు దిద్దుబాటు అయ్యే వీలుంది.

వెండి జులై కాంట్రాక్టు ఈవారం రూ.68,590 కంటే దిగువకు వస్తే రూ.67,026; రూ.65,404 వరకు పడిపోయే అవకాశం ఉంది. రూ.70,965 స్థాయిని అధిగమిస్తే కాంట్రాక్టు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.

ప్రాథమిక లోహాలు

* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ జులై కాంట్రాక్టు ఈవారం రూ.14,886 కంటే ఎగువన కదలాడకుంటే మరింత అమ్మకాల ఒత్తిడికి లోనై     రూ.14,121 వరకు దిద్దుబాటు అవుతుందని అవుతుందని భావించవచ్చు.  రాగి జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.704.05 కంటే పైన కదలాడకుంటే ప్రతికూల ధోరణిలో చలించే అవకాశం ఉంటుంది. సీసం జూన్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.173.85 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.170.45-172.45 సమీపంలో షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. జింక్‌ జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.239.95 స్థాయి కంటే ఎగువకు వెళ్లకుంటే, మరింతగా దిద్దుబాటు కావచ్చు. అల్యూమినియం జూన్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.195.65 వద్ద స్టాప్‌లాస్‌తో షార్ట్‌ సెల్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు.

ఇంధన రంగం

* సహజవాయువు జులై కాంట్రాక్టును ఈవారం రూ.251.25 వద్ద స్టాప్‌లాస్‌తో రూ.244-247.65 సమీపంలో షార్ట్‌ సెల్‌ చేయొచ్చు.
* ముడి చమురు జులై కాంట్రాక్టు ఈవారం రూ.5,368 కంటే ఎగువన చలించకుంటే కొంత అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. 
* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) జూన్‌ కాంట్రాక్టుకు రూ.976.65 వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ స్థాయి కంటే కిందకు వస్తే రూ.930.45 వరకు పడిపోవచ్చు.

వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు జులై కాంట్రాక్టుకు స్టాప్‌లాస్‌ను రూ.8,001కి సవరించుకుని ప్రస్తుత షార్ట్‌ సెల్‌ పొజిషన్లను కొనసాగించడం మంచిదే.
* జీలకర్ర జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.13,113-13,030 లక్ష్యాలతో షార్ట్‌ సెల్‌ పొజిషన్లను కొనసాగించడం మంచిదే..
* సోయాబీన్‌ జులై కాంట్రాక్టు ఈవారం రూ.6,711 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే, ధర పెరిగినప్పుడల్లా  షార్ట్‌ సెల్‌ చేయొచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

చమురు పీఎస్‌యూలలో 100 శాతం ఎఫ్‌డీఐ!

ముసాయిదా సిద్ధం

దిల్లీ: చమురు, సహజవాయువు ప్రభుత్వరంగ సంస్థల్లో 100 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నేరుగా అనుమతించే విషయమై మంత్రివర్గ సంఘం అభిప్రాయాలను తెలుసుకునేందుకు వాణిజ్య, పరిశ్రమల శాఖ ముసాయిదా పత్రాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయా సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించేందుకు ఇప్పటికే సూత్రప్రాయ అనుమతులు ఉన్న నేపథ్యంలో, ఈ ప్రతిపాదన చేసింది. ఇది కనుక ఆమోదం పొందితే, దేశంలోనే రెండో అతిపెద్ద చమురు రిఫైనరీ అయిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం అయ్యే వీలుంది. ఈ ముసాయిదా ప్రకారం, ఎఫ్‌డీఐ విధానంలో పెట్రోలియం, గ్యాస్‌ రంగాలకు కొత్త క్లాజ్‌ను జతచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం సూత్రప్రాయంగా పెట్టుబడుల ఉపసంహరణను నిర్ణయించిన రంగాలకు, 100 శాతం ఎఫ్‌డీఐని నేరుగా అనుమతించడమే ఈ ప్రతిపాదన.

 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని