ఇక.. శాటిలైట్‌ కార్యాలయాలు
close

Published : 23/06/2021 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇక.. శాటిలైట్‌ కార్యాలయాలు

పనిప్రదేశంలో స్వేచ్ఛ వల్ల ప్రయోజనాలెన్నో
 టాటా సన్స్‌ ఛైర్మన్‌  ఎన్‌ చంద్రశేఖరన్‌

ముంబయి: పని ప్రదేశం విషయంలో ఉద్యోగులకు స్వేచ్ఛనివ్వడం వల్ల కంపెనీలకు పలు ప్రయోజనాలు లభిస్తాయని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. ‘కరోనా మునుపటి పరిస్థితులకు ప్రపంచం ఎప్పటికీ వెళ్లదు. అందుకే సాంకేతికత సహాయంతో, పనిప్రదేశం విషయంలో ఉద్యోగులకు స్వేచ్ఛ ఇవ్వడం  మేలని ఆయన వివరించారు.కొవిడ్‌ నేపథ్యంలో, 97 శాతం మంది టీసీఎస్‌ ఉద్యోగులు ఏడాదికి పైగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వారిలో పలువురు తాము కార్యాలయాలకు వచ్చి పనిచేస్తామని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటికి, కార్యాలయానికి మధ్య మరో చోట వారికి పనిప్రదేశాన్ని కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించాల్సి ఉందని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. ‘హైబ్రిడ్‌ నమూనా విజయవంతం కావాలంటే కార్యాలయం, ఇంటికి మించి ఆలోచించాలి. మూడో ప్రదేశాన్ని గుర్తించాలి. దాన్ని మనం శాటిలైట్‌ కార్యాలయంగా లేదా ‘థర్డ్‌ ప్లేస్‌’గా అనుకోవచ్చ’ని  ‘ఖతార్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌’ సమావేశంలో మాట్లాడుతూ ఆయన చెప్పారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని