ఆ డబ్బును ఆదాయంగా చూడొద్దు
close

Published : 24/06/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ డబ్బును ఆదాయంగా చూడొద్దు

అది గృహిణులు జమ చేసుకున్న మొత్తం
నోట్ల రద్దు సమయంలో రూ.2.5 లక్షల వరకు నగదు జమపై  ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

దిల్లీ: నోట్ల రద్దు సమయంలో గృహిణులు బ్యాంకులో జమ చేసిన నగదు రూ.2.5 లక్షల లోపు ఉంటే.. ఆ మొత్తాన్ని వారి ఆదాయంగా పరిగణించరాదని ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఐటీఏటీ) పేర్కొంది. గ్వాలియర్‌కు చెందిన గృహిణి ఉమా అగర్వాల్‌... 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.1,30,810 ఆదాయాన్ని చూపిస్తూ రిటర్నులు దాఖలు చేశారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాలో రూ.2,11,500 జమ చేశారు. రూ.2,11,500కు లెక్క చెప్పాల్సిందిగా ఆమెను ఆదాయపు పన్ను విభాగం కోరింది. తన భర్త, కుమారుడు, ఇతర బంధువులు ఇచ్చిన మొత్తాలను తాను జమ చేసుకున్నానని వివరణ ఇచ్చినా పన్ను అధికారులు అంగీకరించలేదు. లెక్కల్లో చూపించని డబ్బుగా దాన్ని పేర్కొన్నారు. దీంతో ఉమా అగర్వాల్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. వాదనలను విన్న ట్రైబ్యునల్‌.. తన తీర్పును వెల్లడిస్తూ.. ‘మన దేశంలో ఎంతోమంది మహిళలు కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వివిధ సందర్భాల్లో నగదు దాచుకుంటారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడంతో వారు ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవడం మినహా మార్గం లేదు’ అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నోట్ల రద్దు తర్వాత గృహిణులు మాత్రమే రూ.2.50 లక్షల లోపు బ్యాంకులో జమ చేసినప్పుడు దాన్ని వారి ఆదాయంగా పరిగణించరాదని స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని