దేశీయ విపణిలోకి స్కోడా కుషాక్‌ ఎస్‌యూవీ
close

Published : 29/06/2021 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశీయ విపణిలోకి స్కోడా కుషాక్‌ ఎస్‌యూవీ

ధరల శ్రేణి రూ.10.5-17.6 లక్షలు

దిల్లీ: చెక్‌ వాహన తయారీ సంస్థ స్కోడా తమ కుషాక్‌ ఎస్‌యూవీలను భారత విపణిలోకి విడుదల చేసింది. ఈ కార్ల ధరల శ్రేణిని రూ.10.5-17.6 లక్షలుగా (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ) నిర్ణయించింది. ఇండియా 2.0 ప్రాజెక్టులో భాగంగా కంపెనీ అభివృద్ధి చేసిన తొలి ఉత్పత్తి ఇదే. పుణె ప్లాంటులో ఎంక్యూబీ ఏ0 ఐఎన్‌ ప్లాట్‌ఫామ్‌పై వీటిని నిర్మించింది. పెట్రోల్‌ ఇంజిన్‌తో రెండు వేరియంట్లలో ఈ వాహనం లభ్యమవుతుందని సంస్థ పేర్కొంది. బీఎస్‌-6 ఇంజిన్‌, 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌, 7-స్పీడ్‌ డీఎస్‌జీ ట్రాన్స్‌మిషన్‌తో ఇవి రూపొందాయి. 1 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్ల ధరలు రూ.10.6-14.6 లక్షల మధ్య ఉండగా, ఆటోమేటిక్‌ వేరియంట్ల ధరలు రూ.14.2-15.8 లక్షలుగా ఉన్నాయి. 1.5 లీటర్‌ మాన్యువల్‌ రకం ధర రూ.16.2 లక్షలు కాగా, ఆటోమేటిక్‌ (డీఎస్‌జీ) ధర రూ.17.6 లక్షలుగా ఉంది. హిల్‌-హోల్డ్‌ నియంత్రణ, టైర్‌-ప్రెజర్‌ మానిటర్‌ సిస్టమ్‌, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి భద్రతా ప్రమాణాలు ఇందులో ఉన్నాయి. హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌ వంటి మోడళ్లతో కుషాక్‌ పోటీ పడబోతోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని