అమెరికా ప్రభుత్వ నిర్ణయంతోబెజోస్‌కు రూ.63,000 కోట్లు
close

Published : 08/07/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికా ప్రభుత్వ నిర్ణయంతోబెజోస్‌కు రూ.63,000 కోట్లు

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానం పదిలం

టీవలే అమెజాన్‌ సీఈఓ స్థానం నుంచి వైదొలగిన జెఫ్‌ బెజోస్‌  ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలపరచుకున్నారు. ఒకే రోజు ఆయన సంపద విలువ 8.4 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.63,000 కోట్లు) మేర పెరగడంతో మొత్తం సంపద 211 బిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఇందుకు కారణమైంది. మైక్రోసాఫ్ట్‌ కార్ప్‌తో 2019లో కుదుర్చుకున్న 10 బిలియన్‌ డాలర్ల క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌ ప్రకటించింది. ఇప్పుడీ కాంట్రాక్టును మైక్రోసాఫ్ట్‌తో పాటు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌(ఏడబ్ల్యూఎస్‌)కూ పంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అమెజాన్‌ షేరు 5% లాభపడి 3676 డాలర్లకు చేరింది. కంపెనీలో 11%  ఉన్న ఫలితంగా బెజోస్‌ నికర సంపద విలువ ఒక్క రోజే 8.4 బిలియన్‌ డాలర్లు పెరిగిందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తెలిపింది. జనవరి ప్రారంభంలో ఎలాన్‌ మస్క్‌ సంపద 210 బి.డాలర్లకు చేరినప్పటికీ ఆ తర్వాత కిందకు దిగుతూ వచ్చింది. కానీ అమెజాన్‌ షేర్లు మార్చి నుంచి 20% మేర పెరగడంతో జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానానికి ఢోకా లేకుండా పోయింది. ప్రస్తుతం మస్క్‌ కంటే  బెజోస్‌ సంపద విలువ 30 బి.డాలర్లు ఎక్కువగా ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని