జనవరి-మార్చిలో ఎల్‌ఐసీ లిస్టింగ్‌
close

Published : 15/07/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనవరి-మార్చిలో ఎల్‌ఐసీ లిస్టింగ్‌

ప్రభుత్వ లక్ష్యమదే: దీపమ్‌ కార్యదర్శి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో ఎల్‌ఐసీని స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ కోసం త్వరలోనే మర్చంట్‌ బ్యాంకర్లను నియమించుకోనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ఎల్‌ఐసీ ఐపీఓకు కేంద్ర మంత్రివర్గం గత వారంలోనే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఈ ఇష్యూ ద్వారా రూ.90,000 కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. ఎల్‌ఐసీ ఐపీఓ కోసం త్వరలోనే సెబీకి ముసాయిదా పత్రాలను అందజేసే అవకాశం ఉందనీ పాండే తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని