జొమాటో ఐపీఓకు అధిక స్పందన
close

Published : 15/07/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జొమాటో ఐపీఓకు అధిక స్పందన

దిల్లీ: జొమాటో పబ్లిక్‌ ఇష్యూకు తొలి రోజే అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 71.92 కోట్ల షేర్లను జారీ చేయనుండగా, 75.60 కోట్ల షేర్లకు బిడ్‌లకు దాఖలయ్యాయి. చిన్న మదుపర్ల విభాగంలో 2.7 రెట్ల స్పందన లభించింది. సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 38.88 కోట్ల షేర్లకు గాను 13 శాతానికే దరఖాస్తులు లభించాయి. క్యూఐబీలకు కేటాయించిన 38.09 కోట్ల షేర్లలో 36.84 కోట్ల షేర్లకు విదేశీ సంస్థాగత మదుపర్లే బిడ్‌లు దాఖలు చేశారు. ఉద్యోగుల కోసం కేటాయించిన షేర్లకు 18 శాతం దరఖాస్తులే వచ్చాయి. శుక్రవారంతో ముగియనున్న జొమాటో ఐపీఓకు ధరల శ్రేణిగా రూ.72-76ను నిర్ణయించిన సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని