సంక్షిప్త వార్తలు
close

Published : 22/07/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ ధరల శ్రేణి రూ.695- 720

దిల్లీ: గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ పబ్లిక్‌ ఇష్యూకు ధరల శ్రేణిగా రూ.695- 720ను నిర్ణయించారు. ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.1,060 కోట్ల విలువైన షేర్లతో పాటు, గ్లెన్‌ మార్క్‌ ఫార్మాకు చెందిన 63 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ధరల శ్రేణిలోని గరిష్ఠమైన రూ.720ను లెక్కలోకి తీసుకుంటే ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీకి రూ.1,513.60 కోట్లు సమకూరే అవకాశం ఉంది. ఏపీఏ వ్యాపార విభజన నిమిత్తం ప్రమోటర్లకు చెల్లింపులు చేసేందుకు, మూలధన వ్యయాల అవసరాలకు ఈ నిధులను కంపెనీ వినియోగించనుంది.  


2022లో యాపిల్‌ నుంచి 5జీ ఐఫోన్లే

దిల్లీ: 5జీ సాంకేతికతతో పనిచేసే ఐఫోన్‌లనే వచ్చే ఏడాది విడుదల చేసేందుకు యాపిల్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండేళ్ల క్రితం అందుబాటు ధరతో తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎస్‌ఈతో పాటు 2022లో విడుదల చేసే అన్ని ఐఫోన్‌ మోడళ్లు కూడా 5జీతో పనిచేస్తాయి. 2022 నుంచి కొత్తగా 4జీ మోడళ్లను సంస్థ విడుదల చేయకపోవచ్చు. అమ్మకాలు చాలా తక్కువగా ఉన్న ఐఫోన్‌ మినీలో నవీకరించిన వెర్షన్‌ను సైతం కంపెనీ తీసుకురాకపోవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో తీసుకురాబోయే ఐఫోన్‌ ఎస్‌ఈ3లో యాపిల్‌ ఏ14 బయోనిక్‌ ఎస్‌ఓసీ ఫీచర్‌ ఉంటుందని పలు నివేదికలు పేర్కొన్నాయి. 2020 ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌లో ఏ13 బయోనిక్‌ ఉంది. కొత్త ఫీచర్‌ వల్ల ఈఫోన్‌ కూడా ఐఫోన్‌ 12 శ్రేణితో, ఐప్యాడ్‌ ఎయిర్‌తో సమాన సామర్థ్యం కలిగి ఉంటుందని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని