ప్రైవేటు రైళ్ల ప్రాజెక్టుకు పోటీలో ఎంఈఐఎల్‌ గ్రూపు
close

Published : 24/07/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటు రైళ్ల ప్రాజెక్టుకు పోటీలో ఎంఈఐఎల్‌ గ్రూపు

దిల్లీ: ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో భారత రైల్వే శాఖ సిద్ధం చేసిన ప్రైవేటు రైళ్ల ప్రాజెక్టుకు హైదరాబాద్‌కు చెందిన ఎంఈఐఎల్‌ గ్రూపు పోటీ పడుతోంది. మూడు క్లస్టర్లకు ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) బిడ్లు ఆహ్వానించగా, ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌), ఎంఈఐఎల్‌ గ్రూపు ముందుకు వచ్చాయి. ముంబయి- 2, దిల్లీ- 1, దిల్లీ-2 రైల్వే  క్లస్టర్లు ఇందులో ఉన్నాయి. మొత్తం 12  క్లస్టర్లలో 109 జతల రైళ్లు (బయలుదేరు స్థానం, గమ్యస్థానం) నిర్వహించవచ్చు. ప్రైవేటు రైళ్ల ప్రాజెక్టును దశల వారీగా చేపట్టి రూ.30,000 కోట్ల మేరకు పెట్టుబడి సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిప్రకారం 2027 నాటికి 151 రైలు సర్వీసులను ప్రైవేటు సంస్థలు నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని