ఇతర బ్యాంకుల డైరెక్టర్లకు రూ.5 కోట్ల వరకు వ్యక్తిగత రుణాలు
close

Published : 24/07/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇతర బ్యాంకుల డైరెక్టర్లకు రూ.5 కోట్ల వరకు వ్యక్తిగత రుణాలు

బోర్డుల అనుమతి లేకుండానే మంజూరు చేయొచ్చు: ఆర్‌బీఐ

దిల్లీ: బోర్డు అనుమతి తీసుకోకుండానే ఇతర బ్యాంకుల డైరెక్టర్లకు రూ.5 కోట్ల వరకు బ్యాంకులు వ్యక్తిగత రుణాలు ఇవ్వొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం వెల్లడించింది. ఇంతకుముందు ఈ పరిమితి రూ.25 లక్షలుగా ఉంది. ‘ఇతర బ్యాంకులకు చెందిన ఏ డైరెక్టరుకైనా బోర్డు అనుమతి లేకుండా మంజూరు చేసే రుణ పరిమితిని రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్లకు పెంచాలని, సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకున్నామ’ని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. డైరెక్టర్ల బోర్డు లేదా యాజమాన్య కమిటీ అనుమతి లేకుండా రూ.5 కోట్లు లేదా అంతకుమించిన రుణాలను సొంత బ్యాంకు ఛైర్మన్‌ లేదా మేనేజింగ్‌ డైరెక్టరు లేదా ఇతర డైరెక్టర్ల బంధువులకు (భార్య/భర్త మినహా), మైనర్‌ పిల్లలకు మంజూరు చేయకూడదని తెలిపింది. రూ.5 కోట్ల వరకు ఇచ్చే రుణాలను కూడా ఆయా బ్యాంకుల్లోని సంబంధిత అధికారుల దగ్గర అనుమతి తీసుకుని, ఆ విషయాన్ని బోర్డుకు నివేదించాల్సి ఉంటుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని