ఐటీసీ లాభంలో 30% వృద్ధి
close

Published : 25/07/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీసీ లాభంలో 30% వృద్ధి

దిల్లీ: ఏప్రిల్‌-జూన్‌లో ఐటీసీ ఏకీకృత నికర లాభం 30.24% వృద్ధితో రూ.3,343.44 కోట్లకు చేరింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.2567.కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.10,478.46 కోట్ల నుంచి 35.91% పెరిగి రూ.14,240.76 కోట్లకు చేరింది. ఐటీసీ మొత్తం వ్యయాలు రూ.7967.71 కోట్ల నుంచి 28.27% పెరిగి రూ.10,220.49 కోట్లకు చేరుకున్నాయి. ‘జూన్‌ మధ్య నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో పరిస్థితి మెరుగవుతూ వస్తోంది. ప్రస్తుత అనిశ్చిత వ్యాపార వాతావరణంలో పరిస్థితులను సునిశితంగా పరిశీలించను’న్నట్లు కంపెనీ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని