ఐసీఐసీఐ లాభం 52% పైకి
close

Published : 25/07/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐసీఐసీఐ లాభం 52% పైకి

ముంబయి: జూన్‌ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం 52% దూసుకెళ్లి రూ.4,747.42 కోట్లకు చేరుకుంది. తక్కువ కేటాయింపులు ఇందుకు దోహదం చేశాయి. అయితే రిటైల్‌ రుణ విభాగం నుంచి ఒత్తిడి పెరగడం గమనార్హం. స్టాండలోన్‌ పద్ధతిన బ్యాంకు నికర లాభం రూ.4616.02 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్‌-జూన్‌ 2020-21లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఉండడంతో అప్పట్లో నమోదైన లాభం రూ.2599 కోట్లతో పోలిస్తే ఇది 77% అధికం కావడం విశేషం. ఏడాది కిందట జూన్‌లో బ్యాంకు రూ.7,594 కోట్ల మేర కేటాయింపులు చేయగా.. ఈ సారి రూ.2,852 కోట్లు మాత్రమే కేటాయించింది. స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) మార్చి త్రైమాసికంలో 4.96 శాతంగా నమోదు కాగా.. ఈ సారి 5.15 శాతానికి పెరిగాయి. 2020 జూన్‌ త్రైమాసికంలో ఇవి 5.46 శాతం. తాజాగా రూ.7231 కోట్ల రుణాలు ఒత్తిడిలోకి వెళ్లాయి. ఇందులో రిటైల్‌, వ్యాపార బ్యాంకింగ్‌ విభాగం వాటా రూ.6,773 కోట్లు కాగా, ఎస్‌ఎమ్‌ఈ, కార్పొరేట్‌ విభాగాల నుంచి రూ.458 కోట్లు ఉన్నాయి. కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ విభాగంలో రూ.961 కోట్లు, ఆభరణాల రుణాల్లో రూ.1331 కోట్ల మేర ఒత్తిడిలోకి వెళ్లినట్లు బ్యాంకు తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని