అమెరికా నుంచి సిప్లా ఔషధాలు వెనక్కి
close

Published : 26/07/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికా నుంచి సిప్లా ఔషధాలు వెనక్కి

దిల్లీ: ఓవరాక్టివ్‌ బ్లాడర్‌ చికిత్సలో వినియోగించే 7,228 సొలిఫెనాసిన్‌ సక్సినేట్‌ మాత్రల బాటిళ్లను అమెరికా విపణి నుంచి ఔషధ సంస్థ సిప్లా వెనక్కి పిలిపిస్తోంది. తయారీ సమస్యలే ఇందుకు కారణమని తెలిపింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ తాజా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక ప్రకారం.. 10ఎంజీ పరిమాణం కలిగిన 30 మాత్రల బాటిళ్లను కంపెనీ వెనక్కి రప్పిస్తోంది. ఈ ఔషధ బ్యాచ్‌లను కంపెనీకి చెందిన గోవా ప్లాంట్‌లో ఉత్పత్తి చేసి.. న్యూజెర్సీ అనుబంధ విభాగం సిప్లా యూఎస్‌ఏకు పంపించారు. జూన్‌ 10న రీకాల్‌ ప్రక్రియను కంపెనీ ప్రారంభించగా.. క్లాస్‌ 2 రీకాల్‌గా యూఎస్‌ఎఫ్‌డీఏ వర్గీకరించింది. ఈ ఏడాది జనవరిలో సైతం గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ల చికిత్సలో వినియోగించే 5.8 లక్షల ప్యాకెట్ల ఔషధాన్ని కంపెనీ వెనక్కి పిలిపించింది.


అబుదాబి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వైస్‌ చైర్మన్‌గా భారత వ్యాపారవేత్త యూసఫ్‌ అలీ

దుబాయ్‌: అబుదాబి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇంస్ట్రీస్‌(ఏడీసీసీఐ) వైస్‌ చైర్మన్‌గా భారత వ్యాపారవేత్త యూసఫ్‌ అలీ ఎంఏ నియమితులయ్యారు. యూఏఈ కేంద్రంగా పని చేస్తున్న ఏడీసీసీఐకి వైస్‌ ఛైర్మన్‌గా భారత వ్యాపారవేత్త యూసఫ్‌ అలీని నియమిస్తూ అబుదాబి యువరాజు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నయాన్‌ ఆదివారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 29 మంది బోర్డు సభ్యులలో భారత్‌ నుంచి వచ్చిన ఏకైక వ్యక్తిగా యూసఫ్‌ నిలిచారు. 65 ఏళ్ల యూసఫ్‌ అలీ అనేక దేశాల్లో హైపర్‌ మార్కెట్లు, రిటైల్‌ కంపెనీలను నిర్వహిస్తున్న అబుదాబికి చెందిన లులూ గ్రూప్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని