3 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీల పదవీ కాలం పొడిగింపు!
close

Published : 26/07/2021 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీల పదవీ కాలం పొడిగింపు!

10 మంది ఈడీలకూ
డీఓపీటీకి ఆర్థిక శాఖ దస్త్రం

దిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) సహా మరో 2 ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) మేనేజింగ్‌ డైరెక్టర్ల (ఎండీలు) పదవీ కాలాన్ని పొడిగించేందుకు ఆర్థిక శాఖ దస్త్రాన్ని (ఫైల్‌) సిద్ధం చేసి సిబ్బంది, శిక్షణ విభాగానికి (డీఓపీటీ) పంపించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అలాగే వివిధ పీఎస్‌బీల్లో 10 మంది ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల (ఈడీలు) పదవీ కాలాన్ని కూడా పొడిగించేందుకు సిఫార్సు చేసింది.

* పీఎన్‌బీ ఎండీ, సీఈఓ ఎస్‌.ఎస్‌.మల్లికార్జున రావు పదవీ కాలం సెప్టెంబరు 18తో ముగియనుండగా, 2022 జనవరి 31 వరకు ఆయన్ను కొనసాగించాలని ఆర్థిక శాఖ సూచించింది.నీ యూకో బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అతుల్‌ కుమార్‌ గోయల్‌ నవంబరు 1 నుంచి వైదొలగాల్సి ఉండగా, రెండేళ్లు పదవీ కాలం పొడిగించాలని కోరింది.

* బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ, సీఈఓ ఏఎస్‌ రాజీవ్‌ పదవీ కాలాన్ని డిసెంబరు 1 నుంచి మరో రెండేళ్లు పొడిగించాలని సిఫార్సు చేసింది.

* ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా ఎస్‌ఎల్‌ జైన్‌ను నియమించాల్సిందిగా ప్రతిపాదించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని