సహజవాయువును అమ్మొచ్చు!
close

Published : 26/07/2021 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సహజవాయువును అమ్మొచ్చు!

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం, వెండి
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.47,124 కంటే కిందకు వస్తే రూ.46,174 వరకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ పైకి వెళితే రూ.48,119 సమీపంలో నిరోధం ఎదురుకావచ్చు. ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.14,716 కంటే ఎగువన కదలాడకుంటే  రూ.14,701, రూ.14,645 వరకు దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు. వెండి సెప్టెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.68,000 కంటే ఎగువన కదలాడకుంటే రూ.66,612; రూ.66,166 వరకు పడిపోయే అవకాశం ఉంటుంది. 

ప్రాథమిక లోహాలు
ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.16,046 కంటే పైన చలించకుంటే దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు. రాగి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.724.25 కంటే దిగువన చలించకుంటే సానుకూల ధోరణికి అవకాశం ఉంటుంది. సీసం ఆగస్టు కాంట్రాక్టుకు రూ.179.35; రూ.180.25 సమీపంలో కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. జింక్‌ రూ.243.25 కంటే పైన కదలాడకుంటే, మరింతగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అల్యూమినియం రూ.203.45 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. 

ఇంధన రంగం
ముడి చమురు ఆగస్టు కాంట్రాక్టుకు రూ.5,538 వద్ద నిరోధం కన్పిస్తోంది.  సహజవాయువు జులై కాంట్రాక్టును ఈవారం రూ.328 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.314; రూ.319 సమీపంలో షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) జులై కాంట్రాక్టుకు రూ.1,078.35 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, లాంగ్‌ పొజిషన్లు తీసుకోవడం మంచిదే. 

వ్యవసాయ ఉత్పత్తులు
పసుపు ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.7,162 కంటే కిందకు రాకుంటే మరింతగా రాణిస్తుందని భావించవచ్చు.

జీలకర్ర ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.13,444 కంటే దిగువన కదలాడకుంటే..దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.

సోయాబీన్‌ ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.8,356 కంటే దిగువన చలించకుంటే రూ.8,789; రూ.8,808 లక్ష్యాలతో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. 

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని