అత్యధిక వేతన బ్యాంకర్లలో ఆదిత్య పురికి అగ్రస్థానం
close

Published : 26/07/2021 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అత్యధిక వేతన బ్యాంకర్లలో ఆదిత్య పురికి అగ్రస్థానం

ముంబయి: గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో అగ్రగామి మూడు ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో అత్యధిక వేతనం అందుకున్న వ్యక్తిగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆదిత్య పురి అగ్రస్థానంలో నిలిచారు. 2020-21లో పదవీ విరమణ చేసిన ఆయన మొత్తం రూ.13.82 కోట్ల వేతనం అందుకున్నారు. ఆయన వారసుడిగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ పగ్గాలు చేపట్టిన శశిధర్‌ జగదీషన్‌ రూ.4.77 కోట్ల స్థూల వేతనాన్ని పొందారు. పురి అందుకున్న మొత్తంలో రూ.3.5 కోట్ల పదవీ విరమణ ప్రయోజనాలు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ సందీప్‌ భక్షి  స్థిర వేతనంలో బేసిక్‌, అదనపు అలవెన్సులను స్వచ్ఛందంగా వదులుకున్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని