విశాక ఇండస్ట్రీస్‌కు రూ.40.58 కోట్ల లాభం
close

Published : 27/07/2021 02:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాక ఇండస్ట్రీస్‌కు రూ.40.58 కోట్ల లాభం

ఈనాడు, హైదరాబాద్‌: విశాక ఇండస్ట్రీస్‌ జూన్‌ త్రైమాసికానికి రూ.351.17 కోట్ల ఆదాయంపై రూ.40.58 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాలంలో ఆదాయం రూ.286.74 కోట్లు, నికరలాభం రూ.34.42 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 22%, నికరలాభం 18% పెరిగాయి. భవన నిర్మాణ ఉత్పత్తుల్లో 17%, వండర్‌ యార్న్‌లో 123% వృద్ధి నమోదైంది. సిమెంటు రేకుల వ్యాపారంలో విస్తరించే లక్ష్యంతో విశాఖ ఇండస్ట్రీస్‌ ఉత్తప్రదేశ్‌లోని రాయ్‌ బరేలిలో లక్ష టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కొత్త యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల సిమెంటు రేకుల ఉత్పత్తి సామర్థ్యం 9.02 లక్షల టన్నులకు చేరుతుంది. కోయంబత్తూరులో ఫైబర్‌ సిమెంట్‌ బోర్డుల ఉత్పత్తి యూనిట్‌ డిసెంబరుకు పూర్తవుతుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని