94% పెరిగిన యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం
close

Published : 27/07/2021 04:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

94% పెరిగిన యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం

దిల్లీ: ప్రైవేటు రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.2,160.15 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నమోదు చేసిన లాభం రూ.1,112.17 కోట్లతో పోలిస్తే ఇది 94 శాతం అధికం. మొత్తం ఆదాయం   రూ.19,032.15 కోట్ల నుంచి రూ.19,591.63 కోట్లకు చేరింది. అయితే మార్చి త్రైమాసిక ఆదాయం రూ.20,162.76 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఏడాది వ్యవధిలో బ్యాంక్‌ వడ్డీ ఆదాయం రూ.16,445.47 కోట్ల నుంచి రూ.16,003.46 కోట్లకు పరిమితమైంది. పెట్టుబడులపై ఆదాయం రూ.2,973 కోట్ల నుంచి రూ.3,428.20 కోట్లకు చేరింది. రుణ పుస్తకం రిటైల్‌, కార్పొరేట్‌, ఎస్‌ఎంఈ విభాగాలన్నింటిలోనూ వృద్ధి సాధించి 12 శాతం పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 4.72 శాతం నుంచి 3.85 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 1.23 శాతం నుంచి 1.20 శాతానికి పరిమితమయ్యాయి. మొండి బకాయిలు, ఆకస్మిక నిధికి కేటాయింపులు రూ.4,416.42 కోట్ల నుంచి 3,532.01 కోట్లకు తగ్గాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని