హడ్కో ఆఫర్‌ ఫర్‌ సేల్‌కు రూ.870 కోట్ల బిడ్‌లు
close

Published : 28/07/2021 03:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హడ్కో ఆఫర్‌ ఫర్‌ సేల్‌కు రూ.870 కోట్ల బిడ్‌లు

దిల్లీ: హడ్కోలో 8 శాతం వాటా నిమిత్తం ప్రభుత్వం నిర్వహించిన ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ప్రక్రియకు తొలిరోజు సుమారు రెండు రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా సంస్థాగత మదుపర్ల విభాగంలో 9.90 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 19.40 కోట్ల షేర్లకు బిడ్‌లు దాఖలయ్యాయి. ప్రభుత్వం ఒక్కో షేరుకు ఆఫర్‌ చేసిన రూ.45.03 ధర ప్రకారం లెక్కిస్తే సంస్థాగత మదుపర్లు సుమారు రూ.870 కోట్ల విలువైన షేర్లకు బిడ్‌లు దాఖలు చేసినట్లు అవుతుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా హడ్కోలో 8 శాతం వాటాకు సమానమైన మొత్తం 16.01 కోట్లకు పైగా షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. సంస్థాగత మదుపర్లకు బిడ్‌లు వేసే ప్రక్రియ మంగళవారం ప్రారంభం కాగా.. చిన్న మదుపర్లకు బుధవారం అవకాశం ఇచ్చారు. ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వానికి రూ.720 కోట్లు వచ్చే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని