కెనరా బ్యాంక్‌ లాభం మూడింతలు
close

Published : 28/07/2021 03:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కెనరా బ్యాంక్‌ లాభం మూడింతలు

త్వరలో రూ.9000 కోట్ల సమీకరణ

దిల్లీ: జూన్‌ త్రైమాసికంలో కెనరా బ్యాంక్‌ స్టాండలోన్‌ నికర లాభం మూడింతలై రూ.1,177.47 కోట్లకు చేరుకుంది. మొండి బకాయిలు తగ్గడం ఇందుకు ఉపకరించింది. 2020-21 ఇదే మూడు నెలల కాలంలో  లాభం రూ.406.24 కోట్లు మాత్రమే. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి సిండికేట్‌ బ్యాంక్‌ను కెనరా బ్యాంక్‌ విలీనం చేసుకుంది. మొత్తం ఆదాయం రూ.20,685.91 కోట్ల నుంచి రూ.21,210.06 కోట్లకు చేరుకుంది. డెట్‌, ఈక్విటీల మిశ్రమంతో రూ.9,000 కోట్ల నిధులు సమీకరించాలని బ్యాంకు భావిస్తోంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 8.84% నుంచి 8.5 శాతానికి, నికర ఎన్‌పీఏలు  3.95% నుంచి 3.46 శాతానికి తగ్గాయి. ఫలితంగా కేటాయింపులు రూ.3,826.34 కోట్ల నుంచి రూ.3,728.52 కోట్లకు పరిమితమయ్యాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని