పీవీఆర్‌ నష్టం రూ.220 కోట్లు
close

Updated : 30/07/2021 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీవీఆర్‌ నష్టం రూ.220 కోట్లు

దిల్లీ: దిగ్గజ మల్టీప్లెక్స్‌ సంస్థ పీవీఆర్‌ను కొవిడ్‌ మహమ్మారి దారుణంగా దెబ్బ తీసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో ఈ సంస్థ రూ.219.55 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. 2020-21  ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.225.73 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ఆదాయం రూ.12.70 కోట్ల నుంచి రూ.59.39 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.417.06 కోట్లుగా నమోదయ్యాయి. దేశంలో కొవిడ్‌-19 తీవ్రత తగ్గి, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా ప్రదర్శనలకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో క్రమంగా కార్యకలాపాలను ప్రారంభించనున్నామని కంపెనీ తెలిపింది. 2021 జులై 29 నాటికి దేశంలోని 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, కొలంబో, శ్రీలంక కొన్ని పరిమితులతో థియేటర్లు ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చాయి. ఈ ప్రాంతాల్లో 526 తెరలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల రుణం పొందినట్లు పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని