చేతులు కలిపిన అపోలో 24/7, మైక్రోసాఫ్ట్‌
close

Updated : 30/07/2021 10:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేతులు కలిపిన అపోలో 24/7, మైక్రోసాఫ్ట్‌

హైదరాబాద్‌: అపోలో హాస్పిటల్స్‌కు చెందిన డిజిటల్‌ విభాగం అపోలో 24/7, మైక్రోసాఫ్ట్‌ ఇండియాలు చేతులు కలిపాయి. కంపెనీలు తమ ఉద్యోగులకు ఆరోగ్య సేవలు అందించేందుకు వీలుగా ఒక ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్‌ను అపోలోకు మైక్రోసాఫ్ట్‌ అందించనుంది. దీనిని ఆవిష్కరించడానికి ముందుగా మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఉద్యోగులకే 3 నెలల పాటు ప్రయోగాత్మకంగా అందించారు. ఇందులో భాగంగా 5,000 మంది మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు ఈ ఎంటర్‌ప్రైజ్‌ ప్లాట్‌ఫాంకు యాక్సెస్‌ ఇచ్చారు. అందులో 50 శాతం మంది అపోలో డాక్టర్లతో ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ తీసుకున్నారు. 2,600కు పైగా ఔషధాల ఆర్డర్లనూ ఈ యాప్‌ను ఉపయోగించి చేశారు. ప్రతి మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగికి అపోలో నెట్‌వర్క్‌లోని 7,000 మందికి పైగా డాక్టర్లు, స్పెషలిస్టులతో వర్చువల్‌ పద్ధతిలో సంప్రదింపులు జరపడానికి వీలుంటుంది. టెలిమెడిసిన్‌, టీకా బుకింగ్‌, ఫార్మసీ, డయాగ్నోస్టిక్స్‌ పరీక్షలు, ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డులు, వెల్‌నెస్‌ ప్రోగ్రామ్‌లు.. ఇలా అన్నీ ఒక క్లిక్‌ దూరంలోనే వినియోగదార్లకు చేరువవుతాయని అపోలో 24/7 సీటీఓ మధు అరవింద్‌ పేర్కొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని