3 పీఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ!
close

Updated : 30/07/2021 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 పీఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ!

ఎల్‌ఐసీ ఐపీఓకు ముందే

ఈనాడు, దిల్లీ: ఎల్‌ఐసీ మెగా పబ్లిక్‌ ఇష్యూకు ముందే మోదీ ప్రభుత్వం మరో 3 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌), రాష్ట్రీయ కెమికల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ (ఆర్‌సీఎఫ్‌), మిశ్ర ధాతు నిగమ్‌ (మిధాని) సంస్థల్లో  ప్రభుత్వ వాటాల్ని వచ్చే త్రైమాసికంలో విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎన్‌ఎఫ్‌ఎల్‌లో ప్రస్తుతం ప్రభుత్వానికి 74% వాటా ఉండగా ఇందులో 20 శాతాన్ని, ఆర్‌సీఎఫ్‌లో 75 % ఉండగా 10 శాతాన్ని, మిధానిలో 74% ఉండగా, 10%వాటాను విక్రయించనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. ఎల్‌ఐసీని స్టాక్‌మార్కెట్‌లో నమోదు చేయాలనే ప్రతిపాదనను ఈ నెల ప్రారంభంలో ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదించిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని