ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎండీగా కేవీ ప్రదీప్‌
close

Published : 30/07/2021 04:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎండీగా కేవీ ప్రదీప్‌

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు బస్సుల తయారీలో నిమగ్నమైన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ)గా కె.వి.ప్రదీప్‌ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. సివిల్‌ ఇంజనీర్‌ అయిన ఆయనకు వ్యాపార రంగంలో, వివిధ ప్రాజెక్టుల నిర్వహణలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యంత అధునాతన పర్యావరణ హిత విద్యుత్తు బస్సులను దేశీయంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రదీప్‌ తెలిపారు. భవిష్యత్తు అంతా ఇ మొబిలిటీదే కాబట్టి, ఈ సంస్థను మార్కెట్‌ లీడర్‌గా నిలిపేందుకు కృషిచేస్తానని చెప్పారు.

నష్టాల నుంచి లాభాల్లోకి: ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.41.15 కోట్ల ఆదాయాన్ని, రూ.2.03 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు కంపెనీ నష్టాల్లో ఉన్న విషయం గమనార్హం. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.22.15 కోట్లు కాగా, దీనిపై రూ.3.62 కోట్ల నికర నష్టం ఉంది. దీంతో పోల్చితే ఆదాయం 86 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. విద్యుత్తు బస్సుల అమ్మకాలు పెరిగినందున, ఆదాయం అధికమైనట్లు కంపెనీ వివరించింది. వ్యయాలు తగ్గడమే కాకుండా ఇన్సులార్‌, ఇ-బస్‌ డివిజన్లలో లాభదాయకత పెరిగినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ చేతిలో 1325 విద్యుత్తు బస్సుల సరఫరా ఆర్డర్లు ఉన్నాయి. మరో 300 బస్సులకు కంపెనీ ఎల్‌-1 బిడ్డరుగా ఉంది. ఇవే కాకుండా మరికొన్ని ఆర్డర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కంపెనీ వివరించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని